కోనసీమ: కొత్తపేట మండలం కమ్మిరెడ్డి పాలెంలో మురుగు కాలువలు మూసుకుపోయి రోడ్లపై నీరు నిలిచిపోయింది. సత్తెమ్మ పుట్ట వద్ద పరిస్థితి దారుణంగా ఉండటంతో విద్యార్థులు మురుగునీటిలోనే పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. దుర్వాసనతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు