RR: బడంగ్పేట్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి అకాల మరణం అత్యంత విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాలను నిర్భయంగా ఎండగట్టిన ఆయన, అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.