WNP: పట్టణంలోని నాయు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యుల పదవి కాలం ముగిసినది. ఈ నేపథ్యంలో నూతన జిల్లా అధ్యక్ష పదవికి ఎవరైనా ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఉన్నట్లయితే స్వచ్ఛందంగా సంఘానికి తమ పేర్లు అందజేయాలని జిల్లా అధ్యక్షుడు అశ్విని చంద్రకుమార్ తెలిపారు. ఆసక్తిగల సభ్యులు రేపు సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కమిటీ సమావేశం ఉంటుందన్నారు.