BDK: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి 26 వరకు భద్రాద్రి జిల్లాలో సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలలో వంటగది మరమత్తులు చేస్తామని అన్నారు.