NRPT: జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చేందుకు మరో 10 ఇసుక రీచ్ల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ‘మన ఇసుక వాహనం’ ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, రీచ్లకు అనుకూల ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు సూచించారు.