AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. కడపలో అత్యధికంగా 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. నెల్లూరు, మార్కాపురం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కర్నూలు, తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో 43 డిగ్రీలు నమెదైనట్లు తెలిపారు.