MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చిన్న వర్షానికి రోడ్లు బురద మయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఓ కిరాణం షాప్ వద్ద ప్రతినిత్యం బురద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి బురద నీరు చేరడంతో నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని కోరారు.