ATP: జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వినియోగదారులు తమ ఫిర్యాదుల కోసం 89777 16661 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు, ఇతర సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.