KNR: గ్రామపంచాయతీ కార్మికులకు గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని హుజూరాబాద్ సీఐటీయూ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్లో పేర్లు నమోదు కాక బకాయిలు నిలిచిపోయిన కార్మికుల జీతాలు కూడా చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.