ADB: గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన ఆలయ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణానికి గత ప్రభుత్వంలోనే రూ. 70 లక్షల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.