GDWL: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు. ఏఓ సతీష్ కుమార్ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ధర్మం, అహింస, త్యాగానికి చిహ్నమైన వాసవీ మాత ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.