కృష్ణా: గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ అవతరణలో ఎస్సై సత్యనారాయణ ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చేసిన తప్పును సరిదిద్దుకుని, సమాజంలో మంచి వ్యక్తులుగా మెలగాలని ఎస్సై అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.