KDP: ముద్దనూరు(M) ఆకుతోటపల్లికి చెందిన గర్భిణి చిన్న ఒబులమ్మకు ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమవడంతో EMT సుధీర్ కుమార్ అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. మగ శిశువు జన్మించాడు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో EMTకి ప్రశంసలు వెల్లువెత్తాయి.