TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో వడగండ్ల వానలు పడే ఛాన్స్ ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షాలు పడినా పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీలు నమోదు కానున్నాయి.