GDWL: అయిజ మండలం పులికల్ గ్రామంలో ఎమ్మెల్యే విజయుడు సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. టీ. సుశీలమ్మ కుటుంబానికి రూ. 10,500, గురు లక్ష్మన్న కుటుంబానికి రూ.11,500 సహాయంగా అందజేశారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయం ప్రజలకు అండగా నిలుస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.