AP: రాష్ట్ర ప్రభుత్వం ‘108’ అంబులెన్సుల ద్వారా గత 10 నెలల్లో 6.39 లక్షల మందిని ఆసుపత్రులకు చేర్చి వైద్య సేవలు అందించింది. రాష్ట్రంలో మొత్తం 731 అంబులెన్సుల ద్వారా సేవలు అందిస్తోంది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అందించిన సేవల వివరాలను 108 సేవలు నిర్వహిస్తున్న భవ్య హెల్త్‌కేర్ విడుదల చేసింది.