TG: దేశంలోనే TGలో అధికంగా ధాన్యం ఉత్పత్తి అవుతోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈసారి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చని అంచనా వేశారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతులకు నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగిలిపోయిన 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. పెండింగ్లో ఉన్న రూ.1400 కోట్లు విడుదల చేయాలన్నారు.