ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో శుక్రవారం జల్ పక్వాడ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్కూల్ హెచ్ఎం నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి చుక్కా విలువైనది, నీటిని పొదుపు చేద్దాం – ప్రాణాన్ని రక్షిద్దామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకొని భవిష్యత్తు తరాల కోసం కాపాడదామన్నారు.