స్వీడన్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ భారత్‌లో తన వాహన మోడళ్ల ధరలను రూ.1లక్ష వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ అంతరాయాలు, విదేశీ మారకపు ఒడుదొడుకుల కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది.