TG: పార్లమెంటులో తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. తేజస్వి సూర్య అంశాన్ని లీగల్ ఒపీనియన్కు పంపించామన్నారు. అనంతరం వాళ్లు ఇచ్చిన నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.