KMM: మధిర మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్, ఫెస్టిసిడ్స్ షాపులను డీఏవో పుల్లయ్య శుక్రవారం తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్, ఫార్మర్ సేల్ రిజిస్టర్, బిల్ బుక్, ఇన్వాయిస్లను పరిశీలించారు. స్టాక్ బోర్డ్ తప్పనిసరిగా ప్రతిరోజు అప్డేట్ చేయాలని, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని దుకాణదారులకు సూచించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలన్నారు.