VKB: వికారాబాద్ జిల్లాలో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం నిరీక్షిస్తున్న అర్హులందరికీ అవి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సదరం క్యాంపుల నిర్వహణ, UDID పోర్టల్లో వివరాల నమోదుపై డీపీఎంలు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు.