SDPT: జగదేవపూర్ ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు ఎండ తగలకుండా నీడ, తాగడానికి నీటి సౌకర్యం కచ్చితంగా ఉండాలని డీఆర్డీఏ పీడీ జయదేవ ఆచార్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తిగుల్ గ్రామంలోని శ్రీనివాస్ కుంటలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించి.. ప్రతి గ్రామంలో కూలీల సంఖ్యను, పని దినాలను పెంచాలని ఆదేశించారు.