KMR: క్యాన్సర్ వ్యాధి ఏ దశలో ఉన్నా సరైన వైద్యం ద్వారా రోగులను కాపాడవచ్చని సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని యశోద ఆసుపత్రి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం వైద్య రంగంలో వచ్చిన ఆధునిక సాంకేతికతతో క్యాన్సర్కు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్నారు.