మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ నిబంధనలకు లోబడి గ్రామ పాలన సాగాలని, సర్పంచ్ గ్రామానికి లీడర్‌గా వ్యవహరించాలని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆమె మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.