KDP: దువ్వూరు రైతు సేవా కేంద్రం వద్ద జొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ నాగసుధ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రబీలో సాగు చేసిన జొన్న పంట ఈ-క్రాప్‌లో నమోదైన రైతులు ప్రభుత్వ మద్దతు ధరతో (క్వింటా రూ.3699) కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవచ్చన్నారు. ఇందు కోసం రైతు సేవా కేంద్రం పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.