KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు ఈనెల 19న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 – 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.