KMR: బిచ్కుంద మండల కేంద్రంలో ఎక్సెజ్ సీఐకి సంబంధించిన అద్దె ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మికంగా దాడులు నిర్వహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్సెజ్ సీఐ సత్యనారాయణ అద్దె ఇంట్లో నివసిస్తున్న నేపథ్యంలో, ఆయనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు అక్కడ సోదాలు చేపట్టినట్లు సమాచారం.