ఎన్టీఆర్: నందిగామలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పర్యటించారు. డివిఆర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా బోధనపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. అనంతరం హెల్త్ సెంటర్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి, రోగులతో మాట్లాడారు.