TPT: ఎన్నికల్లో అధిక డబ్బులు ఖర్చు పెట్టి అఫిడవిట్లో తక్కువ చూపితే కఠినమైన చర్యలు తీసుకొనేలా సెక్షన్ 10Aలో నిబంధనలు ఉన్నాయి. మూడేళ్ల పాటు సదరు అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతాడు. ఖర్చు పెట్టిన డబ్బులు బ్లాక్ మనీ అయితే ED ద్వారా ఆస్తులపై విచారణ జరిపే అవకాశం ఉంది. అవినీతి సొమ్ము అని తెలితే రెండేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.