MHBD: కేసముద్రం మండలకేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ సమీపంలో మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనం అదుపుతపడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు రవి అనే యువకుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యి రక్తస్రావం అయింది వెంటనే స్థానికులు మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.