GDWL: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని CPI (ML) న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. గద్వాలలో ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరానికి ఆదివారం ఆయన సందర్శించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విద్యుత్ రంగం బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న ఆర్టిజన్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలన్నారు.