SRPT: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డీసీవో సీహెచ్. పద్మ ఇవాళ తెలిపారు. దీని ద్వారా సీవోఈ, రెగ్యులర్, సైనిక్, ఒకేషనల్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 25వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మే 15న ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆమె పేర్కొన్నారు.