MNCL: ఇటీవల బదిలీపై వచ్చిన జన్నారం మండల నూతన ఎస్ఐ ఉదయ్ కిరణ్‌ను మండల బీసీ సంఘం నాయకులు మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య, కో కన్వీనర్ కడార్ల నర్సయ్య, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.