ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత బెండారలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించి, వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను కూడా ఆమె స్వయంగా తనిఖీ చేశారు.