NRPT: మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మురారి మాట్లాడుతూ.. రక్తదాన శిబిరంతో ప్రాణదాతలుగా నిలిచిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రాము,బాలు, రాజు , శ్రీనివాసులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.