TG: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తీరును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎండగట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక ‘పోస్ట్ డేటెడ్ చెక్’ లాంటిదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే బీజేపీ మహిళా రిజర్వేషన్ నాటకం ఆడుతోందని మండిపడ్డారు. 70 కోట్ల మంది మహిళల జీవితాలతో ఆటలాడుతోందన్నారు. రిజర్వేషన్ బిల్లుకు, డిలిమిటేషన్కు లింక్ పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటి? అని ప్రశ్నించారు.