SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన గాయానికి సంబంధించి తుది స్కాన్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. రేపు ఆస్ట్రేలియాలో కమిన్స్‌కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ స్కానింగ్ ఫలితం అనుకూలంగా వస్తే, అతడు ఏప్రిల్ 17న తిరిగి SRH జట్టుతో చేరే అవకాశం ఉంది. కాగా, ఈ ఫిట్నెస్ పరీక్షలో కమిన్స్ కచ్చితంగా నెగ్గుతాడని SRH యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.