JGL: జిల్లాలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఇబ్రహీంపట్నం ఎస్సీ బాయ్స్ హాస్టల్కు చెందిన డి. మాధవ్ ఉపన్యాసంలో ప్రథమ బహుమతి సాధించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నాడు.