NGKL: జిల్లా కేంద్రంలోని రామకృష్ణ మైత్రీ థియేటర్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్య క్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరించారు. అగ్ని ప్రమాదాలను నివారించే విధానాలపై ప్రదర్శనలు నిర్వహించి, సిబ్బంది, ప్రజలకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక కేంద్రాధికారి కృష్ణ మూర్తి పాల్గొన్నారు.