NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో గో సంరక్షణ పథకానికి భక్తులు విరాళం అందజేశారు. లబ్బీపేటకు చెందిన ఆర్.వెంకటేష్ కుటుంబ సభ్యులు అరుంధతి, తల్లిదండ్రుల సమక్షంలో రూ.1,00,000 డీడీని ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ నిధులను పోరంకి గోశాల సంరక్షణ, ఆహారం, సంరక్షణ సదుపాయాల కోసం వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.