TG: గత పదేళ్లలో BRS ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ధర్మపురి అభివృద్ధిపై చర్చకు రావాలని KTRకు సవాల్ విసిరారు. నేరేళ్ల దళితులపై దాడుల ఘటనపై త్వరలోనే సిరిసిల్లకు వచ్చి నిలదీస్తానన్నారు.