TPT: తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. తాతయ్యగుంట సమీపంలోని మల్లంగుంటలో 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అత్యాచారం చేశారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈస్ట్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.