టీమిండియా మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ అరుదైన మైలురాయిని చేరుకుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో బరిలోకి దిగడం ద్వారా, ఆమె అంతర్జాతీయ టీ20ల్లో 100వ మ్యాచ్ను పూర్తి చేసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులోనే 100 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసుకోవడం విశేషం. కాగా, ఈ మ్యాచ్లో ఆమె 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి అవుటైంది.