AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను మహిళలు క్షమించరని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. దేశ జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెంచి, మహిళలకు న్యాయం చేయాలని NDA ప్రభుత్వం భావిస్తుంటే, విపక్షాలు రాజకీయ కుట్రలతో మెలికలు పెడుతున్నాయని విమర్శించారు. 2029లోపు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.