NDL: డోన్ మండలం కొచ్చేరువులో పొదుపు మహిళల అద్వర్యంలో ఆదివారం జనగణన స్వీయ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని వెలుగు సిబ్బంది నిర్వహించారు. మహిళలు చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని ‘మన సమాచారమే – మన భవిష్యత్తు, జనగణనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం’ వంటి నినాదాలతో గ్రామమంతా ర్యాలీ చేపట్టారు. వెలుగు సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి స్వీయ నమోదుపై వివరించారు.