KMR: చింతల్పేట్ గ్రామంలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణకు దారి తీసి రక్తపాతం చోటుచేసుకుంది. వర్ని మండలం చింతల్ పేట్ గ్రామానికి చెందిన ప్రేమ్ సింగ్ కుటుంబ సభ్యులపై, అదే గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి హరిదాస్ కుటుంబ సభ్యులు ఇవాళ దాడి చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో ప్రేమ్ సింగ్కు తలపై గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.