CTR: చిత్తూరు జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయమూర్తుల సదస్సు ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య అధ్యక్షతన, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను సమీక్షించి, వేగంగా పరిష్కరించాలని సూచించారు.