MDCL: ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లో టమాట ధరలు ఒక్కసారిగా పెరిగి వినియోగదారులకు భారంగా మారాయి. గత వారం కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉన్న ధరలు ఇప్పుడు రూ.35కు చేరుకున్నాయి. సరఫరా తగ్గడం, వేసవి ప్రభావంతో పంట నష్టం జరగడం వల్లే ఈ పెరుగుదల జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.