SRD: గుమ్మడిదల మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ కౌన్సిల్‌కు సంబంధించి మొత్తం నలుగురు సభ్యుల (ప్రత్యేక పరిజ్ఞానం గల ఇద్దరు, అల్పసంఖ్యాక వర్గం నుంచి ఇద్దరు) ఎంపిక కోసం ఈ ప్రక్రియను చేపట్టారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీలోగా తమ దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్‌కు సమర్పించాల్సి ఉంటుంది.